Friendship Day 2023: ఫ్రెండ్‌షిప్ డే బెస్ట్ కోట్స్.. మీ మిత్రుడ్ని ఇలా విష్ చేయండి..

happy-friendship-day-2023

రక్త సంబంధం కాదు, పేగు తెంచుకుని పుట్టిన తోబుట్టువు అంతకంటే కాదు.. బంధువు కాదు, ఏ బంధమూ కాదు. కానీ ఈ బంధాల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగే బంధమే స్నేహం. ఒరేయ్ నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని కమాండ్ చేసేది రక్త సంబంధం అయితే.. నువ్వు ఇలా ఉంటేనే నీ లైఫ్ లోకి వస్తాను అనేది వైవాహిక బంధం అయితే.. నువ్వు బాగుంటేనే నీ ఇంటికొస్తా, నీ ముఖం చూస్తా అని అనేది బంధుత్వం అయితే.. అసలు నువ్వెలా ఉన్నా పర్లేదు.. నువ్వు కళ్ళ ముందు ఉంటే చాలు అని అనేది స్నేహ బంధం మాత్రమే. స్వార్థం అనే పదాన్ని భూతద్దం వేసి మరీ వెతికినా దొరకనటువంటి అద్భుతమైన వ్యక్తి ఫ్రెండ్. మీ జీవితంలో మీకు దొరికిన అద్భుతమైన ఫ్రెండ్స్ కి ది బెస్ట్ కోట్స్ వారికి పంపించి ఈ ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకోండి.

బెస్ట్ ఫ్రెండ్‌షిప్ డే కోట్స్:

  • గాయపడిన మనసుని సరిచేసేందుకు, స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • నీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేకపోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ ఫ్రెండ్ మాత్రమే. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • ఒక మంచి స్నేహితుడు నీ యొక్క అన్ని కథలు తెలుసు.. కానీ ఉత్తమ స్నేహితులు మాత్రమే ఆ ప్రతీ కథలో జీవిస్తారు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం అని చెప్పేది స్నేహం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • చిన్న విషయం కాదు స్నేహం, ఎంతటి సమస్యనైనా చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు, మన కష్ట సమయాల్లో భుజం తట్టి నేనున్నాని చెప్పటం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • స్నేహమంటే పక్కనే రాసుకుపూసుకు తిరిగే వ్యక్తి మాత్రమే కాదు.. ఎంత దూరాన ఉన్న పక్కనే ఉన్న అనుభూతిని కల్గించడం కూడా స్నేహమే. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పు లేదు, కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • స్నేహితులంటే ఏం చేసినా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు.. తప్పు చేస్తే దండించే తండ్రి, గురువు స్థానాన్ని తీసుకునే గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • చీకటిపడితే మన నీడే మనల్ని వీడుతుంది.. కానీ, స్నేహం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • కుల, మత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
  • ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా, నిర్భయంగా పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!

 



from SumanTV https://ift.tt/o1EBz0y

Post a Comment

Previous Post Next Post

Below Post Ad