Chandrayaan 3 : చంద్రుడి వీడియో వచ్చింది.. విడుదల చేసిన ఇస్రో.. షేకింగ్ వీడియో

Chandrayaan 3 Video : చంద్రయాన్ 3 గురించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బిగ్ అప్డేట్ ను ఇచ్చింది. జూలై 14న చంద్రుడిపైకి పంపిన ఉపగ్రహం తీసిన చంద్రుడికి సంబంధించిన వీడియోను ఆదివారం విడుదల చేసింది. దీనికి ‘చంద్రయాన్-3 మిషన్, ది మూన్, చంద్ర కక్ష్య ఇన్సర్షన్ సమయంలో చంద్రయాన్ 3 వీక్షించింది’ అనే క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోలో చంద్రుడు బూడిద రంగులో కనిపిస్తున్నాడు. చంద్రుని రెండో కక్షలోకి ప్రవేశించే ముందు ఉపగ్రహం ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది.

చంద్రుడిపై పరిశోధన చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై 14న మద్యాహ్నం ‘చంద్రయాన్-3’ పేరుతో ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఆ తరువాత విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టారు. దాదాపు 16 రోజుల పాటు భూ కక్ష్య పూర్తి చేసుకున్న ఉపగ్రహం ఆగస్టు 1న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఆగస్టు 6 న చంద్రుడికి సంబంధించిన వీడియోను తీసింది. ఈవీడియోను ఇస్రో రిలీజ్ చేసింది.

భారతీయులు ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 ఆర్బిటర్ ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు విజయవంతంగా తన యాత్ర పూర్తి చేస్తున్న ఉపగ్రహం చంద్రుడిపై దిగే వరకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో రూ.613 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. గతంలో చంద్రయాన్ 2 ఇలాగే ప్రవేశపెట్టారు. అయితే చంద్రుడిపై దిగే క్రమంలో ఆర్బిటర్ విఫలమైంది. కానీ ఈసారి అలా జరగకుండా పకడ్బందీ చర్చలు తీసుకొని ప్రయోగం చేపట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక చంద్రయాన్ బరువు 3 వేల 900 కిలోలు కాగా.. అందులో ల్యాండర్, రోవర్ బరువు 1752కిలోలు.



source https://oktelugu.com/chandrayaan3-mission-latest-news-isro-moon-landing-spacecraft-sees-the-moon/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad