Tesla Gigafactory: చైనాలో అమెరికన్ కంపెనీ విజయనాదం

Tesla Gigafactory

Tesla Gigafactory: అమెరికా, చైనా మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తనను దాటేసి నెంబర్వన్ స్థానానికి చైనా వెళ్లిపోతుందనే అక్కసు అమెరికాది అయితే.. ప్రపంచం మీద అమెరికా పెత్తనం ఇంకా ఎన్ని సంవత్సరాలనే ధిక్కారం చైనాది.. రెండు దేశాలకు బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నందువల్ల అవి ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ చైనాలో ఒక అమెరికన్ కంపెనీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అదేంటి రెండు దేశాల మధ్య సయోధ్య సరిగా లేనప్పుడు ఇలా ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? కచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే దాని వెనక ఉంది మనీ. మనీ మిక్స్ మెనీ థింగ్స్ అని ఊరకనే అనలేదు కదా.

చైనాలో అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ దిగ్గజం టెస్లా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. చైనాలోని షాంగై లోన్ టెస్లా ఏకంగా భారీ ఫ్యాక్టరీ నిర్మించింది. దీనికి “గిగా” అనే పేరు పెట్టింది. ప్రతి 40 సెకండ్లకు ఒక ఎలక్ట్రిక్ వాహనం తయారయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది.. విషయాన్ని ఓ ట్విట్టర్ వీడియో ద్వారా తెలిపింది. సంస్థ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రాసెస్ కు, ప్రోడక్టివిటీ, ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని ఆ వీడియో చాటి చెబుతోంది. అక్కడి పరిసరాలు, ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తీరు చాలా బాగుంది. ఆధ్యాధునిక పరికరాలతో కార్లను తయారు చేస్తున్న విధానం కూడా ఆకట్టుకుంది. తర్వాత స్థాయిలో అనే విధంగా కార్లను తయారు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

చైనా దేశంలో టెస్లాకు అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. ఇక్కడ తయారైన వాహనాలు ఆసియాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రతి 40 సెకండ్లకు ఒక మోడల్ తయారవుతుండడం గొప్ప విషయమే. ఈ అంశంలో మరో దిగ్గజ సంస్థ ఫోర్డ్ ను టెస్లా వెనక్కి నెట్టేసింది. అమెరికా డియర్ బార్న్ ట్రక్ ప్లాంట్ లో 49 సెకండ్లకు ఓ ఎఫ్_150 పికప్ ట్రక్ ను తయారు చేస్తున్నట్టు ఈ ఏడాది తొలినాళ్లలో ఫోర్డ్ సంస్థ ప్రకటించింది. ఇక టెస్లా కు అమెరికాలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉంది. అమెరికా బయట చైనాలో మాత్రమే ఫ్యాక్టరీ ఉంది. షాంగై లో ఉన్న ప్లాంట్ కు సంబంధించి ఓ మహిళ తాజాగా ఒక వీడియో రూపొందించింది. టెస్లా కంపెనీ మొత్తాన్ని ఆమె తన వీడియోలో బంధించింది. సిబ్బందితో మాట్లాడింది.. ఉత్పత్తి, ఇతర విషయాల గురించి వారితో చర్చించింది. షాంగై గిగా ఫ్యాక్టరీలో రెండు మోడల్స్ ను మాత్రమే టెస్లా తయారు చేస్తోంది. ఈ రెండు మోడల్స్ టెస్లా కంపెనీకి అత్యంత చవకైనవి. వీడిని ఇక్కడ తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పటి సిబ్బంది పంటలను టెస్లా అధిపతి మస్క్ పలుమార్లు మెచ్చుకున్నారు. అయితే ఇండియాలోకి ఇచ్చేందుకు టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు మస్క్ ఆయనను కలిశారు. ఇద్దరి మధ్య వ్యాపారానికి సంబంధించిన చర్చలు జరిగాయి.. ఈ నేపథ్యంలోనే ఇండియాలో నడిపేందుకు అనువైన ఎలక్ట్రిక్ కారును టెస్లా రూపొందిస్తున్నదని తెలుస్తోంది. సంస్థ చరిత్రలోనే అతిపెద్ద చవకైన కారుగా ఇది నిలుస్తుందని సమాచారం.



source https://oktelugu.com/the-tesla-gigafactory-in-shanghai-produces-an-electric-car-every-40-seconds/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad