ఐటీ చెల్లిస్తే ఫ్రీ రేషన్ కట్..

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపు దారుల వివరాలను ఆహార మంత్రిత్వశాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వారికి పీఎంజీకేఏవై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ. 1.97 లక్షల కోట్లు వెచ్చించనుంది. 2025 26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్‌లో రూ. 2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది. దేశంలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు.

ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమైంది. ఈమేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఓ ఆఫీస్ ఆర్డరును జారీ చేసింది. అందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ ( సిస్టమ్స్ )వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధి లోని ఆహారం, ప్రజాపంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని పంచుకోనుంది. ఆధార్, పాన్ , మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే, నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉన్నవారి డేటాను డీజీఐటీ సిస్టమ్స్ అందిస్తుంది. అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా కీలకం కానుంది. ఈ గుర్తింపు పూర్తయ్యాక కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.



from Mana Telangana https://ift.tt/I5WRl0H

Post a Comment

Previous Post Next Post

Below Post Ad