స్పేస్‌వాక్ సమయంలో సునీతా విలియమ్స్ రికార్డు

భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మొత్తం స్పేస్‌వాక్ సమయంలో ఒక మహిళా వ్యోమగామిగా 62 గంటల 6 నిమిషాలు సాధించి రికార్డు సృష్టించారు. 2024 జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్, ఆమె సహచర వ్యోమగామి బచ్ విల్మోర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గురువారం స్పేస్‌వాక్ చేశారు. వీరిద్దరూ ఏమాత్రం పనిచేయని రేడియో కమ్యూనికేషన్స్ హార్డ్‌వేర్‌ను తొలగించడానికి ఐఎస్‌ఎస్ బయటకు వచ్చి పరీక్షించారు. కక్ష లేబొరేటరీ బయటను సూక్ష్మజీవులు ఉన్నాయేమో అన్న అనుమానంతో శాంపిల్స్ సేకరించారు.

వీరి స్పేస్‌వాక్ ఈస్ట్‌టైమ్ ప్రకారం ఉదయం 7,43కు ప్రారంభమై మధ్యాహ్నం 1.09గంటలకు ముగిసింది. అంటే 5 గంటల 26 నిమిషాల పాటు స్పేస్‌వాక్ సాగింది. విలియమ్స్‌కు ఇది తొమ్మిదో స్పేస్‌వాక్ కాగా, విల్మోర్‌కు ఐదోది. ఇదివరకటి మాజీ వ్యోమగామి పెగ్గీ విట్‌సన్స్ మొత్తం స్పేస్‌వాక్ సమయం 60 గంటల 21 నిమిషాలు కాగా, ఆ రికార్డును విలియమ్స్ అధిగమించారని నాసా తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది. నాసా ఆల్‌టైమ్ లిస్టులో విలియమ్స్ నాలుగో స్థానాన్ని సాధించారు.



from Mana Telangana https://ift.tt/z9jSxqJ

Post a Comment

Previous Post Next Post

Below Post Ad