
బంగారం ధరలు మరలా పుంజుకోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మరలా స్పాట్ గోల్డ్ సానుకూల ధర వద్ద కొనసాగుతుంది. ఈ కారణంగా మరోసారి దేశీయంగా బంగారం ధరలు పెరగనున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1937 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 1936 డాలర్ల వద్ద కొనసాగింది. దీంతో దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లలో మార్పు లేదు. స్పాట్ గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గిన కారణంగా దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,950 ఉండగా ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ. 54,950 వద్ద కొనసాగుతోంది.
ఇక 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 59,950 ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి విషయానికొస్తే.. నిన్నటి మీద ఇవాళ కొంచెం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో మొన్న ఔన్స్ స్పాట్ వెండి 23.76 డాలర్లు ఉండగా.. నిన్న 23.53 డాలర్ల వద్ద కొనసాగింది. ఈ కారణంగా దేశీయంగా వెండి ధర తగ్గింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 78,500 ఉండగా ఇవాళ రూ. 300 తగ్గింది.
దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 78,200 వద్ద కొనసాగుతోంది. బంగారమైనా, వెండి అయినా కొనాలి అనుకుంటే కనుక ఇప్పుడు కొనడమే మంచిది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్, స్పాట్ వెండి ధరలు సానుకూలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం అంటే ఉదయం 7:50 గంటలకు ఔన్స్ స్పాట్ గోల్డ్ 1942.8 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. స్పాట్ వెండి 23.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సానుకూలంగా సాగుతున్న కారణంగా దేశీయంగా ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఆగస్టు 5న 22 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,495 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 43,960 ( ₹ 0 )
- 10 గ్రాములు: ₹ 54,950 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 5,49,500 ( ₹ 0 )
ఆగస్టు 5న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,995 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 47,960 ( ₹ 0 )
- 10 గ్రాములు: ₹ 59,950 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 5,99,500 ( ₹ 0 )
ఆగస్టు 5న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹78.20 ( ₹ -0.30 )
- 8 గ్రాములు: ₹ 625.60 ( ₹ -2.40 )
- 10 గ్రాములు: ₹ 782 ( ₹ -3 )
- 100 గ్రాములు: ₹ 7,820 ( ₹ -30 )
- 1000 గ్రాములు: ₹ 78,200 ( ₹ -300 )
from SumanTV https://ift.tt/fM67viJ