
మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న బంగారం ధర భారీగా పతనమయ్యింది. గ్లోబల్ గా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుతున్నాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1945 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 1937 డాలర్లకు పతనమైంది. దీంతో దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,100 ఉండగా ఇవాళ రూ. 150 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ. 54,950 వద్ద కొనసాగుతోంది. ఇక నిన్న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ. 60,110 ఉండగా ఇవాళ పది గ్రాముల మీద రూ. 160 తగ్గింది.
దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 59,950 వద్ద కొనసాగుతోంది. పసిడి బాటలోనే వెండి ధర కూడా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి మొన్న 24.38 డాలర్లు ఉండగా నిన్న 23.76 డాలర్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ఇవాళ వెండి ధర పతనమైంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80,300 ఉండగా.. ఇవాళ ఏకంగా రూ. 1800 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 78,500 వద్ద కొనసాగుతుంది. ఈ రెండు రోజుల్లో కిలో వెండి రూ. 2500 తగ్గింది. అయితే ఈ ధరలు దేశీయ మార్కెట్లో మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల విషయంలో ప్రతికూలత నెలకొంది.
ప్రస్తుతం అంటే ఇవాళ ఉదయం 9:00 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1936.29 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ఔన్స్ స్పాట్ గోల్డ్ నిన్నటితో పోలిస్తే ఇవాళ మరింత పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం పడుతుంది. ఈ కారణంగా బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 23.53 డాలర్ల వద్ద కొనసాగుతుంది. దేశీయ మార్కెట్లో వెండి ధరపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా వెండి ధర కూడా తగ్గుతుంది.
ఆగస్టు 4న 22 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,495 ( ₹ -15 )
- 8 గ్రాములు: ₹ 43,960 ( ₹ -120 )
- 10 గ్రాములు: ₹ 54,950 ( ₹ -150 )
- 100 గ్రాములు: ₹ 5,49,500 ( ₹ -1500 )
ఆగస్టు 4న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,995 ( ₹ -16 )
- 8 గ్రాములు: ₹ 47,960 ( ₹ -128 )
- 10 గ్రాములు: ₹ 59,950 ( ₹ -160 )
- 100 గ్రాములు: ₹ 5,99,500 ( ₹ -1600 )
ఆగస్టు 4న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹78.50 ( ₹ -1.80 )
- 8 గ్రాములు: ₹ 628 ( ₹ -14.40 )
- 10 గ్రాములు: ₹ 785 ( ₹ -18 )
- 100 గ్రాములు: ₹ 7,850 ( ₹ -180 )
- 1000 గ్రాములు: ₹ 78,500 ( ₹ -1800 )
from SumanTV https://ift.tt/usBRUpV