Today Gold Rates: వరుసగా నాలుగో రోజు తగ్గిన గోల్డ్ రేట్లు.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

gold

బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు పుంజుకోవడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వల్ల బంగారం మీద ఉన్న పెట్టుబడులను బాండ్ ఈల్డ్స్ వైపు మళ్లిస్తున్నారు. దీంతో డిమాండ్ తగ్గి బంగారం ధర తగ్గుతుంది. ఈ కారణంగా దేశీయంగా ధరలు తగ్గాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1918.88 డాలర్ల వద్ద కొనసాగగా.. నిన్న ఉదయం 1915.63 డాలర్ల వద్ద కొనసాగింది. ఈ కారణంగా దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,700 ఉండగా.. ఇవాళ రూ. 150 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ. 54,550 వద్ద కొనసాగుతుంది.

ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 59,670 వద్ద కొనసాగగా.. ఇవాళ రూ. 160 తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ. 59,510 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 22.71 డాలర్ల వద్ద ఉండగా.. నిన్న 22.76 డాలర్ల వద్ద కొనసాగింది. వెండి ధర పెరుగుదలలో పెద్దగా మార్పు లేకపోవడంతో దేశీయంగా కూడా మార్పులు లేవు. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర స్థిరంగా ఉంది. నిన్న కిలో వెండి రూ. 76,200 ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది. అయితే రేపు కూడా ఈ ధర స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ స్పాట్ వెండి 22.69 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి ధర మీద పోలిస్తే తక్కువే అయినప్పటికీ పెద్దగా తేడా లేదు. కాబట్టి స్థిరంగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి వెండి ఈరోజు కొనుక్కోవడం మంచిది. ఇక బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ స్పాట్ గోల్డ్ 1913.83 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి మీద పోలిస్తే తక్కువే ఉంది. కాబట్టి రేపు దేశీయంగా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి బంగారం కొనేందుకు రేపు మంచి అవకాశంగా భావించవచ్చు.

gold

ఆగస్టు 12న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,455 ( ₹ -15 )
  • 8 గ్రాములు: ₹ 43,640 ( ₹ -120 )
  • 10 గ్రాములు: ₹ 54,550 ( ₹ -150 )
  • 100 గ్రాములు: ₹ 5,45,500 ( ₹ -1500 )

ఆగస్టు 12న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,951 ( ₹ -16 )
  • 8 గ్రాములు: ₹ 47,608 ( ₹ -128 )
  • 10 గ్రాములు: ₹ 59,510 ( ₹ -160 )
  • 100 గ్రాములు: ₹ 5,95,100 ( ₹ -1600 )

ఆగస్టు 12న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹76.20 ( ₹ 0 )
  • 8 గ్రాములు: ₹ 609.60 ( ₹ 0 )
  • 10 గ్రాములు: ₹ 762 ( ₹ 0 )
  • 100 గ్రాములు: ₹ 7,620 ( ₹ 0 )
  • 1000 గ్రాములు: ₹ 76,200 ( ₹ 0 )


from SumanTV https://ift.tt/FSIQ1Xd

Post a Comment

Previous Post Next Post

Below Post Ad