Gaandeevadhari Arjuna Twitter Talk: గాండీవధారి అర్జున ట్విట్టర్ టాక్: వరుణ్ తేజ్ మూవీ హిట్టా? ఫట్టా?

Gaandeevadhari Arjuna Twitter Talk

Gaandeevadhari Arjuna Twitter Talk: ప్రయోగాత్మక చిత్రాలకు వరుణ్ తేజ్ పెట్టింది పేరు. ఈసారి ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున మూవీ చేశారు. ఆగస్టు 25న గాండీవధారి అర్జున మూవీ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. గాండీవధారి అర్జున మూవీ ట్విట్టర్ టాక్ ఏంటో చూద్దాం..

గాండీవధారి అర్జున మూవీ కథ విషయానికి వస్తే… అర్జున్ వర్మ( వరుణ్ తేజ్) బాడీ గార్డ్. ఇండియన్ మినిస్టర్ అయిన నాజర్ కి దేశద్రోహుల నుండి ప్రాణహాని ఉంటుంది. ఈ హై ప్రొఫైల్ మినిస్టర్ ని కాపాడే బాధ్యత బాడీ గార్డ్ అర్జున్ వర్మ తీసుకుంటాడు. మరి అర్జున్ వర్మ లక్ష్యం ఎలా సాగిందనేదే కథ. ట్విట్టర్ లో గాండీవధారి అర్జున చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు సినిమా పట్ల పాజిటివ్ గా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

గాండీవధారి అర్జున మూవీ బాగుంది. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ ఆకట్టుకుంది. రిచ్ లొకేషన్స్ లో తెరకెక్కించిన విజువల్స్ మెప్పిస్తాయి. మిక్కీ జే మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బీజీఎమ్ అలరించింది అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు, హీరో వరుణ్ తేజ్ ప్రెజెన్స్ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ గా చెబుతున్నారు. సాక్షి వైద్య గ్లామర్ తో పాటు తన పాత్ర పరిధిలో పర్లేదని అంటున్నారు.

అదే సమయంలో గాండీవధారి అర్జున మూవీ గురించి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ నెరేషన్ చాలా స్లోగా ఉంది. యాక్షన్ మూవీస్ కి కావాల్సిన రేసీ స్క్రీన్ ప్లే లేదు. సినిమా ఫ్లాట్ గా సాగుతుంది. ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండవు. కథలో బలం లేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ లో చెప్పుకునే అంశాలు లేవంటున్నారు. లాజిక్ లెస్ సన్నివేశాలు ఎక్కువయ్యాయి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదని అంటున్నారు. ఇది గాండీవధారి అర్జున ట్విట్టర్ టాక్…



source https://oktelugu.com/gaandeevadhari-arjuna-twitter-talk-in-telugu/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad