Crocodiles : మొసళ్లను వేటాడే 10 భీకర జంతవులు ఇవీ

Crocodiles : ఇటీవల ఒక వీడియో వైరల్ అయ్యింది. ఓ సరస్సులో నీటిని తాగుతున్న చిరుత పులిని నీళ్లలోంచి వచ్చిన ముసలి అమాంతం పట్టేసింది. నీటిలోకి తీసుకెళ్లి ప్రాణాలు తీసింది. అంత పెద్ద చిరుత సైతం ముసలి ముందు ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. అయితే భయంకరమైన ముసళ్లను సైతం వేటాడే కొన్ని జంతువులు ఉన్నాయి. వాటిని చూస్తేనే ముసళ్లకు కింద మీదా తడిసిపోతాయి.. ఆ మొసళ్లనే వేటాడే 10 జంతువులు ఏంటో తెలుసుకుందాం.

మొసళ్ళు నీళ్లలో ఉన్నంతవరకూ వాటిని మించిన బలవంతమైన మాంసాహారి మరొకటి లేదు. తనదైన రోజున ఎలాంటి జంతువును అయినా సరే అమాంతం పట్టేసి నీళ్లలోకి తీసుకెళ్లి చంపేయగలదు. . అయితే మొసళ్లను సైతం వేటాడే కొన్ని జీవులు ఉన్నాయి. ఈ సందర్భాలు చాలా అరుదుగా కలుగుతాయి. మొసళ్లను వేటాడేందుకు ప్రసిద్ధి చెందిన 10 జంతువులు ఉన్నాయి.

సింహాలు: సింహాలు అడవికి రాజులే. జంతువులన్నింటిలోనూ అత్యున్నత మాంసాహారులు. నీటి అంచుకు దగ్గరగా వచ్చిన మొసళ్లపై దాడి చేసి సింహాలు చంపేస్తాయి.

జాగ్వార్‌లు: జాగ్వార్‌లు ప్రావీణ్యం కలిగిన వేటాడే జంతువులు. వాటికి పరిధి అంటూ లేదు. స్థానిక ఆవాసాలలో ఏ ఆహారం దొరకనప్పుడు మొసళ్లను వేటాడి చంపి తింటుంటాయి.

ఏనుగులు: కొన్ని సందర్భాల్లో ఏనుగులు తమ పిల్లలకి ముప్పు కలిగించే మొసళ్ల పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. నీటి వనరుల దగ్గర కాచుకునే మొసళ్లను తమ పాదంతో తొక్కి చంపేస్తాయి.

పెద్ద కొండచిలువలు: బర్మీస్ కొండచిలువ వంటి కొన్ని పెద్ద కొండచిలువ జాతులు చిన్న నుండి మధ్యస్థ పరిమాణంలో ఉన్న మొసళ్లను ఆకస్మికంగా దాడి చేసి వాటిని పూర్తిగా మింగేస్తాయి.

హిప్పోలు: నీటిలోనే ఉండే ఇవి తమకు ముప్పుగా పరిణమించేవరకూ వేచిచూస్తాయి. మొసళ్లు తమ పిల్లలకు హాని చేస్తాయని భావిస్తే మొసళ్లను ఎదుర్కొంటాయి. వాటిని అమాంతం మింగేస్తాయి.

పులులు: పులులు శక్తివంతమైన మాంసాహారులు. ఆహారం దొరకని సమయంలో ఇవి నీటి వనరుల వద్ద కాపు కాచి మొసళ్లను వేటాడుతాయి. ప్రత్యేకించి మొసళ్ళు పులి యొక్క భూభాగంలోకి ప్రవేశించినప్పుడు ఇలా దాడి చేసి చంపేస్తాయి.

పిరాన్హాలు: పెద్ద మొసళ్లకు ప్రత్యక్ష ముప్పు కానప్పటికీ పిరాన్హాలు కొన్ని సందర్భాల్లో చనిపోయిన గాయపడిన మొసళ్ల అవశేషాలను తింటాయి.

మొసళ్ళు వాటి ఆవాసాలలో అతి భీకర వేటాడే జంతువుగా ఉంది. అవి సాధారణంగా వాటి పరిమాణం, శక్తి కారణంగా ఇతర జంతువులను భయపడేలా చేస్తాయి. చాలా తక్కువగా వేటకు గురి అవుతాయి. ఎక్కువగా ఇవే వేటాడేస్తాయి.



source https://oktelugu.com/10-animals-that-hunt-crocodile-lion-jaguar-leopard-wildlife/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad