ప్రజాగాయకుడు గద్ధర్ మరణానికి కారణమిదే..

gaddar

ప్రజా గాయకుడు గద్దర్ గుండెపోటుకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. గత పది రోజులుగా ఆయన ఈ ఆస్పటల్లో గుండె సంబంధిత చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. పీపుల్స్ మార్చ్ యాత్రలో పాల్గొన్న సమయంలోనే గుండె సంబంధిత ఇబ్బంది వచ్చిందని గద్దర్ పేర్కొన్నారు. దీంతో తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రజాగాయకుడు గద్దర్ మరణ వార్త విని తెలుగు ప్రజలు షాక్ కు గురవుతున్నారు. ఆయనకు రెండు రోజుల క్రిందటే అపోలో ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ రోజు ఉదయం బీపీ పెరగి.. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే మల్టిపుల్ ఆర్గాన్స్ పూర్తిగా దెబ్బతినడంతో గద్దర్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

గద్దర్ మృతిపై హైదరాబాద్ అమీర్ పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి డాక్టర్లు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఈ మధ్యహ్నాం 3 గంటలకు కన్నుమూశారని వైద్యులు తెలిపారు. గద్దర్ తీవ్రంగా గుండె వ్యాధితో జూలై 20 తేదీన ఆస్పత్రిలో చేరారని, ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేశామని తెలిపారు. సర్జరీ నుండి కోలుకున్నారు. కానీ గతంలోని ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణించారని వైద్యులు వెల్లడించారు.

గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చాడు. గద్దర్ అసలు పేరు విఠల్‌రావు 1987లో కారంచేడు హత్యాకాండపై గద్దర్ పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఓ ఊపు ఊపారు. గద్దర్ మృతితో విమలక్క, వీహెచ్ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. పలువురు కళాకారులు కూడా అక్కడికి చేరుకుని తమ సంతాపాన్ని ప్రకటించారు.



from SumanTV https://ift.tt/JVzW9kl

Post a Comment

Previous Post Next Post

Below Post Ad