హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

hardik pandya

హార్దిక్ పాండ్యాను వరుసపెట్టి నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోపం కారణంగా చాలా అనర్ధాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా వరుసగా రెండో టీ20లో ఓడిపోవడానికి కారణం హార్దిక్ పాండ్యా తప్పుడు నిర్ణయాలే అని ఆగ్రహాం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నెటిజన్స్ మాత్రమే కాదు.. వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కి కూడా హార్దిక్ పాండ్యా చేసిన తప్పేంటో బయటపెట్టారు. ఇలా పొరుగింటి ఆటగాళ్లు, మన నెటిజన్లు హార్దిక్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. హార్దిక్ చేసిన తప్పులను సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్ మరోసారి తప్పు చేశారని మండిపడుతున్నారు.

టీమిండియా కెప్టెన్ హార్డీ పాండ్యా తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న వెస్ట్ ఇండీస్ తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో తిలక్ వర్మకి 50 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది. అప్పటికే 49 పరుగులు చేసి ఉన్న తిలక్ ఇంకొక్క పరుగు చేసి ఉంటే హాఫ్ సెంచరీ పూర్తయ్యేది. స్ట్రైక్ తనదైతే ఒక్క పరుగేం కర్మ.. ఒక్క బంతిలో ఆరు పరుగులు చేసే సత్తా ఉంది. కానీ అవతల హార్దిక్ స్ట్రైక్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా సిక్స్ కొట్టి మ్యాచ్ ని ముగించాడు. వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల నష్టంతో 20 ఓవర్లలో 159 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. టీమిండియా 17.5 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసిన మ్యాచ్ గెలిచింది. 14 బంతులకు రెండు రన్స్ కొడితే ఇండియా గెలుస్తుంది. మరోవైపు తిలక్ వర్మ హఫ్ సెంచరీ కూడా పూర్తవుతుంది.

కానీ హార్దిక్ పాండ్యా తన గురించే ఆలోచించుకున్నాడని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. పోనీ టైట్ సిచ్యువేషన్ కూడా కాదని.. ఇంకా మరో ఓవర్ కూడా ఉందని.. తిలక్ హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా కూడా స్ట్రైక్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా తప్పు చేశాడని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తానేదో గొప్ప ఫినిషర్ అనిపించుకోవడం కోసం సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసి ఉంటే తిలక్ వర్మకు మరింత మైలేజ్ వచ్చేదని అంటున్నారు. ఇంకా 13 బంతులు మిగిలి ఉన్నా కూడా హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి తిలక్ వర్మ హాఫ్ సెంచరీకి అడ్డుపడ్డాడని.. ఒకసారి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ సంఘటనను గుర్తు చేసుకోమని.. విరాట్ టాలెంట్ ని ధోని ఎలా ఎంకరేజ్ చేశారో తెలుసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

hardik pandya

ధోనికి అవకాశం ఉన్నా కూడా విరాట్ కోహ్లీ కోసం డిఫెన్స్ ఆడుతూ ఎంకరేజ్ చేశారని.. మరి నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తున్నావ్ అంటూ హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్నారు. హార్దిక్ పాండ్యా లాంటి స్వార్థ క్రికెటర్ ని ఎక్కడా చూడలేదని.. ఇదా కెప్టెన్సీ అంటే అంటూ మండిపడుతున్నారు. ఇప్పటివరకూ అత్యంత స్వార్థపూరిత క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది హార్దిక్ పాండ్యానే అంటున్నారు. తిలక్ వర్మకు ఇంకొక్క పరుగు చేసే అవకాశం ఇచ్చి ఉంటే హాఫ్ సెంచరీ అయ్యేది. కానీ హార్దిక్ సిక్స్ కొట్టి షో ఆఫ్ చేశాడని అంటున్నారు. తిలక్ వర్మ.. మీరు ఈ ప్రపంచానికి అర్హులు. మీరు మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డారు కానీ పాము మీ కష్టాన్ని తన ఖాతాలో వేసుకుంది అంటూ హార్దిక్ ని పాముతో పోలుస్తున్నారు.

ఒక లైక్ తో హార్దిక్ ని ఒక చెంప దెబ్బ కొట్టినట్టు.. ఒక రీట్వీట్ 10 చెంపదెబ్బలు కొట్టినట్టు.. 1 రిప్లై 15 చెంపదెబ్బలతో సమానం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్ ప్లేయర్స్ తో హ్యాపీగా లేడని ఈ ఒక్క ఇన్సిడెంట్ చెబుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కాదు.. హార్పిక్ పాండ్యా అంటూ తిడుతున్నారు. నిజానికి నెటిజన్స్ కడుపు మంటకు అర్థం ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో వేరే ఎవరు ఉన్నా తిలక్ వర్మకి అవకాశం ఇచ్చేవారు. కానీ అక్కడుంది హార్దిక్ కాబట్టి అలా చేశారు. మరీ ఇంత స్వార్థంగా ఎలా ఉంటారో. మరి హార్దిక్ పాండ్యా తీరుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.



from SumanTV https://ift.tt/Sgod2Z4

Post a Comment

Previous Post Next Post

Below Post Ad