వివాహ బంధంపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

Supreme Court

వివాహ బంధంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల బంధం అనేది పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. తనకు విడాకులు మంజూరు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జంట దాదాపు 20 ఏళ్లుగా దూరంగా ఉంటోంది. గతంలో వీరిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు వెలువరించింది.

దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.తాజాగా ఈ కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు ఆదేశాలను సమర్ధించింది. “ వివాహబంధం అనేది పరస్పర విశ్వాసం,సహచర్యం, భాగస్వామ్య అనుభవాల పునాదులపై నిర్మితమై ఉంటుంది. ఈ కేసులో దంపతులు ఇవేమీ లేకుండా చాలా కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య విరోధాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంధాన్ని పునరుద్ధరించే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది ” అని పేర్కొంది.



from Mana Telangana https://ift.tt/t1PsL2z

Post a Comment

Previous Post Next Post

Below Post Ad