
అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధర ఇవాళ మాత్రం పతనమైంది. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1963 డాలర్లు ఉండగా నిన్న 1980 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,150 ఉండగా ఇవాళ రూ. 300 పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అయితే నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 60,160 ఉంది. ఇవాళ రూ. 330 పెరగడంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,490 వద్ద కొనసాగుతోంది.
ఇంకా పెరుగుతాయనుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో పతనమవ్వడంతో తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న 1980 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్ ఇవాళ ఉదయానికి 1950 డాలర్లకు పతనమైంది. ఏకంగా 30 డాలర్ల మేర పడిపోయింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ రూ. 1950.81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం పడనుంది. ఇక వెండి ధర కూడా పసిడి బాటలోనే తగ్గుముఖం పట్టింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80,400 ఉండగా ఇవాళ ఏకంగా రూ. 1100 పెరిగింది.
దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 81,500 వద్ద కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కొనడం కంటే రేపు కొనడం మంచిది. ఎందుకంటే నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 25.11 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ 24.15 డాలర్లకు పడిపోయింది. దీంతో రేపు దేశీయ మార్కెట్లో వెండి ధర తగ్గే అవకాశం ఉంది. అలానే బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బంగారం, వెండి కొనాలనుకునేవారు ఈరోజు కొనడం కంటే రేపు కొనుక్కోవడం చాలా ఉత్తమం. ఈరోజు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసి బాధపడేకంటే తగ్గిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది. బంగారం, వెండి కొనేందుకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.
జూలై 28న 22 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,545 ( ₹ +30 )
- 8 గ్రాములు: ₹ 44,360 ( ₹ +240 )
- 10 గ్రాములు: ₹ 55,450 ( ₹ +300 )
- 100 గ్రాములు: ₹ 5,54,500 ( ₹ +3000 )
జూలై 28న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 6,049 ( ₹ +33 )
- 8 గ్రాములు: ₹ 48,392 ( ₹ +264)
- 10 గ్రాములు: ₹ 60,490 ( ₹ +330 )
- 100 గ్రాములు: ₹ 6,04,900 ( ₹ +3300 )
జూలై 28న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹ 81.50 ( ₹ +1.10 )
- 8 గ్రాములు: ₹ 652 ( ₹ +8.80 )
- 10 గ్రాములు: ₹ 815 ( ₹ +11 )
- 100 గ్రాములు: ₹ 8,150 ( ₹ +110 )
- 1000 గ్రాములు: ₹ 81,500 ( ₹ +1100 )
from SumanTV https://ift.tt/D7XuVlj