Today Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఏకంగా రూ. 2 వేలకు పతనం..

gold rate

ఈ వారాంతంలో బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గడంతో ఇవాళ దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,450 వద్ద ఉండగా ఇవాళ రూ. 350 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,100 వద్ద కొనసాగుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 60,490 ఉండగా ఇవాళ రూ. 380 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 60,110 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా చూసుకుంటే ఔన్స్ స్పాట్ గోల్డ్ ప్రస్తుతం అంటే 7:30 గంటలకు 1959.24 డాలర్ల వద్ద కొనసాగుతుంది.

మొన్న ఉదయం 1980 డాలర్ల వద్ద ఉన్న ఔన్స్ స్పాట్ గోల్డ్ నిన్న ఉదయం 1950 డాలర్లకు పడిపోయింది. ఈ కారణంగా దేశీయంగా ఇవాళ పసిడి ధరలు తగ్గాయి. అయితే విదేశీ మార్కెట్లో బంగారం 9 డాలర్లకు పెరిగింది. సానుకూలంగా ఉన్న కారణంగా ఈ ధర పెరిగే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కాబట్టి బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఇక వెండి ధర విషయానికొస్తే మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 25.11 డాలర్లు ఉండగా నిన్న 24.15 డాలర్లకు పడిపోయింది.

ఈ కారణంగా దేశీయంగా వెండి ధర పతనమైంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 81,500 ఉండగా ఇవాళ ఏకంగా రూ. 2 వేలు తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 79,500 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ స్పాట్ వెండి 24.34 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి మీద ఈ ధర స్వల్పంగా పెరిగింది. సానుకూలంగా సాగుతున్న కారణంగా వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కావున వెండి కొనాలనుకునేవారికి ఇదే మంచి తరుణం. ఈరోజే కొన్నుకుంటే డబ్బులు ఆదా అవుతాయి.

gold rate

జూలై 29న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,510 ( ₹ -35 )
  • 8 గ్రాములు: ₹ 44,080 ( ₹ -280 )
  • 10 గ్రాములు: ₹ 55,100 ( ₹ -350 )
  • 100 గ్రాములు: ₹ 5,51,000 ( ₹ -3500 )

జూలై 29న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 6,011 ( ₹ -38 )
  • 8 గ్రాములు: ₹ 48,088 ( ₹ -304)
  • 10 గ్రాములు: ₹ 60,110 ( ₹ -380 )
  • 100 గ్రాములు: ₹ 6,01,100 ( ₹ -3800 )

జూలై 29న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹ 79.50 ( ₹ -2 )
  • 8 గ్రాములు: ₹ 636 ( ₹ -16 )
  • 10 గ్రాములు: ₹ 795 ( ₹ -20 )
  • 100 గ్రాములు: ₹ 7,950 ( ₹ -200 )
  • 1000 గ్రాములు: ₹ 79,500 ( ₹ -2000 )


from SumanTV https://ift.tt/FUby3vP

Post a Comment

Previous Post Next Post

Below Post Ad