ప్రజల పక్షాన గొంతెత్తితే అక్రమ కేసులా?:ఎంఎల్‌ఎసి కవిత

ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. సోమవారం ఆమె కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. బోథ్ ఎంఎల్‌ఎ అనీల్ జాదవ్‌తో కలిసి ఇంద్రవెల్ల్ల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. ఎసిబి కేసులతో కెటిఆర్‌పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి కేసులు పెట్టినా తమ కార్యకర్తలు భయపడేదే లేదని తేల్చిచెప్పారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. 12 వేలకు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.

బిఆర్‌ఎస్ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని ఆరోపించారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన ఆదివాసీ గిరిజనులు ఎందరో అమరులయ్యారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఆ పోరాటాల పట్ల గౌరవంతో గిరిజనలకు భూములపై హక్కులు ఉండాలని భావించిన కెసిఆర్ హయాంలో 4.5 లక్షల ఎకరాలకు సంబంధించి గిరిజనులు, ఆదివాసీలకు హక్కలు కల్పించరని గుర్తు చేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతి చెందిన బాలిక శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించిన మేరకకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎంఎల్‌ఎసి కవిత వెంట పార్టీ ఎంఎల్‌ఎలు కోవ లక్ష్మి, అనీల్ జాదవ్ తదితరులు ఉన్నారు..



from Mana Telangana https://ift.tt/Dix1SQT

Post a Comment

Previous Post Next Post

Below Post Ad