యుపి విద్యార్థి మృతి.. గువహతి ఐఐటిలో నిరసన ఉద్రిక్తత

స్థానిక గువహతి ఐఐటి (ఐఐటిజి)లో సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 21 ఏండ్ల విద్యార్థి హాస్టల్ గదిలో చనిపోయి ఉండగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. కాగా ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక సంస్థలో విద్యార్థులు విషాదాంతం చెందడం ఇది నాలుగో ఘటన. పరిస్థితులు ఈ విధంగా ఉంటే తాము ఏ విధంగా సక్రమంగా చదువుకునే వీలుంటుందని నిరసనలకు దిగిన దశలో విద్యార్థులు అధికారులను నిలదీశారు. చనిపోయిన విద్యార్థి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. ఈ విద్యార్థి మృతికి కారణాలను ఆరాతీస్తున్నారు.



from Mana Telangana https://ift.tt/GocrnXP

Post a Comment

Previous Post Next Post

Below Post Ad