Virender Sehwag: సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం! హెడ్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్?

Sehwag Head Coach For Sunrisers Hyserabad (1)

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. వరుసగా మూడు సీజల పాటు అత్యంత చెత్త ప్రదర్శనతో దారుణమైన విమర్శలను మూట గట్టుకుంటుంది. ఈ సీజన్ లో 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచులోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. టీంలో ఆటగాళ్ల ఎంపిక దగ్గర నుంచి కోచ్ వరకు సన్ రైజర్స్ కి ఏది కలిసి రావడం లేదు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుగా అడగపెట్టి స్టార్ లతో కనీసం ప్లే ఆఫ్ కి చేరే జట్టు ఇప్పుడు కనీస స్థాయి ప్రదర్శన చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం భారీ ,మార్పులు చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో మొదట హెడ్ కోచ్ లారా మీద వేటు వేయనున్నట్లుగా సమాచారం. అదే జరిగితే ఆ జట్టుకి భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లారా స్థానంలో హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

సన్ రైజర్స్ జట్టులో హెడ్ కోచ్ గా సెహ్వాగ్ రాబోతున్నాడా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఉంటున్న లారా.. విండీస్ జట్టుని చక్కదిద్దే పరిస్థితిలో ఉన్నట్లుగా సమాచారం. ఎటూ లారాని తొలగించే ప్రయత్నంలో ఉంటే మరోవైపు లారా కూడా ఈ కోచ్ పదవి మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. విండీస్ హెడ్ కోచ్ అండీ కొలీతో పాటు విండీస్ టీం కి సలహాదారునిగా ఉండాలనుకుంటున్నాడట. దీంతో లారాపై వేటు పడడం దాదాపు కంఫర్మ్ అయిపోయింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. అతడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ కి సెహ్వాగ్ లాంటి అనుభవం ఉన్న సీనియర్ హెడ్ కోచ్ గా వస్తే ఇక తిరుగుండదు. గతంలో సెహ్వాగ్ పంజాబ్ టీం కి నాలుగు సంవత్సరాల పాటు మెంటార్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎన్నో ఏళ్ళు ఐపీఎల్ ఆడిన అనుభవం సెహ్వాగ్ కి ఉంది. బ్యాటింగ్ లో దూకుడు ప్రదర్శించే సెహ్వాగ్ హైద్రాబాద్ జట్టుకి కోచ్ గా తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కానీ కొంతమంది అభిమానులు మాత్రం డెక్కన్ ఛార్జర్స్ కి టైటిల్ అందించిన గిల్క్రిస్ట్ ని హెడ్ కోచ్ గా తీసుకొని వస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ కి ఎవరిని హెడ్ కోచ్ గ నియమిస్తారో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.



from SumanTV https://ift.tt/36PAv9I

Post a Comment

Previous Post Next Post

Below Post Ad