Today Gold Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?

today-gold-rates-27th-july

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడంతో దేశీయంగా కూడా పెరిగాయి. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1962 డాలర్లు ఉండగా నిన్న 1963.28 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,000 ఉండగా ఇవాళ రూ. 150 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 60 వేలు ఉండగా ఇవాళ రూ. 160 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,160 వద్ద కొనసాగుతోంది.ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ బాగా పెరిగింది.

నిన్న 1963 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్.. ఇవాళ ఉదయం 8:15 గంటలకు 1981 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఏకంగా 18 డాలర్ల మేర పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మొన్న ఔన్స్ స్పాట్ వెండి 24.48 డాలర్లు ఉండగా నిన్న 24.6 డాలర్లు వద్ద కొనసాగింది. నిన్న స్వల్పంగా పెరగడంతో దేశీయంగా కూడా ఇవాళ వెండి ధర పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80 వేలు ఉండగా ఇవాళ రూ. 400 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 80,400 వద్ద కొనసాగుతుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో నిన్న ఔన్స్ స్పాట్ వెండి 24 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ ఉదయం 25.11 డాలర్ల వద్ద కొనసాగుతుంది.

జూలై 27న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,515 ( ₹ +15 )
  • 8 గ్రాములు: ₹ 44,120 ( ₹ +120 )
  • 10 గ్రాములు: ₹ 55,150 ( ₹ +150 )
  • 100 గ్రాములు: ₹ 5,51,500 ( ₹ +1500 )

జూలై 27న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 6,016 ( ₹ +16 )
  • 8 గ్రాములు: ₹ 48,128 ( ₹ +128)
  • 10 గ్రాములు: ₹ 60,160 ( ₹ +160 )
  • 100 గ్రాములు: ₹ 6,01,600 ( ₹ +1600 )

జూలై 27న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹ 80.40 ( ₹ +0.40 )
  • 8 గ్రాములు: ₹ 643.20 ( ₹ +3.20 )
  • 10 గ్రాములు: ₹ 804 ( ₹ +4 )
  • 100 గ్రాములు: ₹ 8,040 ( ₹ +40 )
  • 1000 గ్రాములు: ₹ 80,400 ( ₹ +400 )


from SumanTV https://ift.tt/OgUjyao

Post a Comment

Previous Post Next Post

Below Post Ad