Today Gold Rates: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనేందుకు ఇదే మంచి అవకాశం..

gold

నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, స్పాట్ వెండి ధరలు ప్రతికూలంగా సాగిన కారణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం పడింది. దీంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,150 ఉండగా ఇవాళ రూ. 150 తగ్గింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,000 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం నిన్న హైదరాబాద్ లో రూ. 60,160 ఉండగా ఇవాళ 10 గ్రాముల మీద రూ. 160 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 60 వేల వద్ద కొనసాగుతుంది. జూలై 18న 60 వేల మార్కుని టచ్ చేసిన బంగారం ఆ తర్వాత జూలై 20న గరిష్టంగా రూ. 60,750కి చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇవాళ మళ్ళీ రూ. 60 వేలకు పడిపోయింది.

నిన్న అంతర్జాతీయ మార్కెట్లో 1962 డాలర్లు ఉన్న ఔన్స్ స్పాట్ గోల్డ్ ఇవాళ ఉదయం 7:25 గంటలకు 1963.28 డాలర్లకు పెరిగింది. ఈ కారణంగా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం పడుతుంది. అయితే స్థిరంగా ఉండటం గానీ పెరగడం గానీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు కొనుక్కోవడం బెటర్. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే తగ్గింది. హైదరాబాద్ లో నిన్న కిలో వెండి రూ. 80,500 ఉండగా ఇవాళ రూ. 500 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి రూ. 80 వేల వద్ద కొనసాగుతుంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 24.48 డాలర్లు ఉండగా ఇవాళ 24.6 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి మీద స్వల్పంగా పెరిగింది. ఈ ధర రేపు దేశీయ మార్కెట్లో వెండి ధరపై ప్రభావం చూపుతుంది. స్థిరంగా ఉండచ్చు లేదా స్వల్పంగా పెరిగే అవకాశం ఉండచ్చు. కాబట్టి వెండి కొనాలనుకునేవారు ఇప్పుడు కొనడమే మంచిది.

జూలై 26న 22 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 5,500 ( ₹ -15 )
  • 8 గ్రాములు: ₹ 44,000 ( ₹ -120 )
  • 10 గ్రాములు: ₹ 55,000 ( ₹ -150 )
  • 100 గ్రాములు: ₹ 5,50,000 ( ₹ -1500 )

జూలై 26న 24 క్యారెట్ల బంగారం ధరలు:

  • 1 గ్రాము: ₹ 6,000 ( ₹ -16 )
  • 8 గ్రాములు: ₹ 48,000 ( ₹ -128)
  • 10 గ్రాములు: ₹ 60,000 ( ₹ -160 )
  • 100 గ్రాములు: ₹ 6,00,000 ( ₹ -1600 )

జూలై 26న వెండి ధరలు:

  • 1 గ్రాము: ₹ 80 ( ₹ -0.50 )
  • 8 గ్రాములు: ₹ 640 ( ₹ -4 )
  • 10 గ్రాములు: ₹ 800 ( ₹ -5 )
  • 100 గ్రాములు: ₹ 8,000 ( ₹ -50 )
  • 1000 గ్రాములు: ₹ 80,000 ( ₹ -500 )


from SumanTV https://ift.tt/k5uNPpU

Post a Comment

Previous Post Next Post

Below Post Ad