Pawan Kalyan Bro Movie: బ్రో మూవీలో సీఎం జగన్ కి దిమ్మ తిరిగే డైలాగ్స్… ఆ సీన్ అయితే కేక!

Pawan Kalyan Bro Movie

Pawan Kalyan Bro Movie: సినిమా పాలిటిక్స్ వేరు కాదు. ఎప్పటి నుండో రాజకీయనాయకులను సినిమాలతో విమర్శించే సాంప్రదాయం ఉంది. రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉండేలా చూసుకుంటారు. జనసేన ఇమేజ్ పెంచే విధంగా డైలాగ్స్ రాస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. తన లేటెస్ట్ మూవీ బ్రోలో కూడా ఏపీ సీఎం జగన్ కి చురకలు వేశాడని టాక్.

బ్రో ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో పొలిటికల్ డైలాగ్స్ వైరల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ రాసిన పొలిటికల్ రిలేటెడ్ డైలాగ్స్ పవన్ నోటి నుండి ఓ రేంజ్ లో పేలాయట. థియేటర్స్ జనసైనికులు పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారట. ఇక జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు మీద త్రివిక్రమ్ రాసిన ఓ డైలాగ్ అద్భుతం అంటున్నారు.

సాయి ధరమ్ ఓ సీన్లో టీ గ్లాసును ఉద్దేశిస్తూ… ఏంటి నీ చేతికి ఆ గాజు గ్లాసు రావాలి, అంతేగా? అంటాడట. అది కేవలం గాజు గ్లాసు కాదు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను మార్చే ఆయుధం, అని పవన్ కళ్యాణ్ అంటారట. ఈ డైలాగ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్న తీరు కొందరిని అబ్బురపరుస్తుంది. మరికొందరు నొచ్చుకునేలా చేస్తుంది.

ఇక నేడు విడుదలైన బ్రో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలివేషన్స్, వింటేజ్ గెటప్స్ ఫీస్ట్. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆలోచింపజేసే సందేశంతో దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారంటున్నారు. ముఖ్యంగా బ్రో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే చిత్రం. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్న మాట వినిపిస్తోంది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు.



source https://oktelugu.com/pawan-kalyan-counter-dialogues-on-cm-jagan-in-bro-movie/

Post a Comment

Previous Post Next Post

Below Post Ad